యువతిపై దాడి చేసి చంపిన చిరుత పులి

చిరుత పులి దాడిలో యువతి మృతి చెందింది. ఈ విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని వేలురూ జిల్లాలో చోటు చేసుకుంది.

Update: 2024-12-19 03:11 GMT

దిశ, వెబ్ డెస్క్: చిరుత పులి దాడిలో యువతి మృతి చెందింది. ఈ విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని వేలురూ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే డిగ్రీ చదువుతున్న యువతి వాటి ఇంటి సమీపంలోని అడవిలో కట్టెలు తీసుకురావటానికి వెళ్లింది. ఈ క్రమంలో అటుగా వచ్చిన చిరుత పులి యువతిపై దాడి చేసి చంపింది. ఈ సమయంలో యువతి పెద్ద ఎత్తున కేకలు వేయడంలో గమనించిన స్థానికులు హుటాహుటిన అడవిలోకి పరుగులు తీయగా.. అప్పటికే యువతిని చంపేసినట్లు గమనించారు. అనంతరం స్థానిక ఆటవి, పోలీసులకు యువతి కుటుంబస్తులు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీ అధికారులు.. చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేని విధంగా తమ గ్రామ సమీపంలో చిరుత సంచరించడమే కాకుండా ఒకరిని హతమార్చడంతో.. పరిసర గ్రామల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


Similar News