suicide :చదువుకు దూరమయ్యానని యువతి ఆత్మహత్య
పెంబి మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన సిమల జయ(17 ) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.
దిశ, పెంబి : పెంబి మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన సిమల జయ(17 ) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఇంటర్ చదువుతున్న సమయంలో అపెండిక్స్ ఆపరేషన్ కావడంతో పరీక్షలు రాయలేక ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అప్పటి నుంచి తల్లిదండ్రులతో కలిసి పొలం పనికి వెళ్తుండేది. తాను చదువుకోలేకపోయానని నిత్యం బాధపడుతుండేది. శనివారం జయశ్రీ తన తల్లి సోమవ్వతో కలిసి పత్తి చేనుకు వెళ్లి పురుగుల మందు తాగింది. అది గమనించిన ఆమె తల్లిదండ్రులు వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. మృతురాలి తండ్రి లింగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.