తహసీల్దార్ కార్యాలయంలో మృత శిశువు కలకలం..

ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఒక మృత శిశువు కనపడింది.

Update: 2023-06-19 11:43 GMT

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఒక మృత శిశువు కనపడింది. తహసీల్దార్ కార్యాలయం ప్రక్కనే బాలికల హాస్టల్ వుండడంతో హాస్టల్ నుంచి పడేసి వుంటారని అధికారులు భావిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం లో కనిపించిన మృత శిశువు ఆరు నెలల వయసు వుంటుందని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారం వెలుగు చూడడంతో పోలీసులు , రెవెన్యూ, ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు. గర్భం దాల్చి 5, 6 నెలల్లో అబార్షన్ జరిగి ఉండవచ్చనే ప్రాధమిక అంచనాకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News