సిరిసిల్లలో మరో కీచక టీచర్
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే వక్రబుద్ధి చూపిస్తున్నారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే వక్రబుద్ధి చూపిస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇటీవల సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అతనిపై పొక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే.
కాగా తాజాగా ఇదే పట్టణంలోని ఓ వార్డుకు చెందిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఆ ప్రధానోపాధ్యాయున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు సమాచారం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.