శ్రద్ధా వాకర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ పని నేను చేయలేదని మాట మార్చిన అఫ్తాబ్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో కీలక పరిణామం ఎదురైంది.

Update: 2023-05-09 10:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో కీలక పరిణామం ఎదురైంది. తాను శ్రద్ధా వాకర్‌ను చంపలేదని నిందితుడు అఫ్తాబ్ పూనావాలా అన్నారు. ఈ కేసులో తను విచారణకు సిద్ధమని, విచారణ ఎదుర్కొంటానని సాకేత్ కోర్టుకు చెప్పారు. మంగళవారం కేసులో అఫ్తాబ్ పూనావాలాపై ఢిల్లీ కోర్టు హత్యానేరం (ఐపీసీ సెక్షన్ 302) కింద కేసు నమోదు చేసింది. అంతేకాకుండా సాక్ష్యాలు మాయచేసినందుకు అతడిపై పోలీసులు (ఐపీసీ సెక్షన్ 201) అభియోగాలు నమోదు చేశారు.

ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సుదీర్ఘకాలం ఆధారాల సేకరణకు కేటాయించారు. ఆ ఆధారాలను ఢిల్లీలోని సాకేత్ కోర్టులో సమర్పించారు. ఈ ఆధారాలను పరిశీలించిన కోర్టు అభియోగాలు ఫ్రేమ్ చేసింది. తన గర్ల్‌ఫ్రెండ్‌ను చంపేసిన అభియోగాలను ఈ రోజు సాకేత్ కోర్టు ఫ్రేమ్ చేసింది. కాగా, అఫ్తాబ్ పూనావాలా ఆ అభియోగాలను తిరస్కరించారు. విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కేసు ప్రొసీడింగ్స్ జూన్ 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. శ్రద్ధా వాకర్ హత్య కేసులో జనవరి 24న ఢిల్లీ పోలీసులు 6,629 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.

మే నెల 2022లో అఫ్తాబ్, శ్రద్ధా వాకర్‌లు ఢిల్లీలో అద్దె గది తీసుకొని సహజీవనం చేసేవారు. అయితే కొద్ది రోజుల నుంచి శ్రద్ధా నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆమె ఫ్రెండ్ శ్రద్ధా తండ్రిని సంప్రదించారు. కూతురు జాడ తెలియకపోవడంతో ఆమె తండ్రి అక్టోబర్‌లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఢిల్లీలో అఫ్తాబ్ గదిలో పోలీసులు శ్రద్ధా వాకర్ శరీర భాగాలు గుర్తించారు. డీఎన్ఏ పరీక్షలు చేసి అవి శ్రద్ధా శరీర భాగాలుగా గుర్తించారు. పూనావాలా తన ప్రియురాలు అయిన శ్రద్ధా వాకర్‌ను అతి కిరాతంకా చంపి శరీరాన్ని 35 భాగాలుగా నరికి ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో పడేశాడు. నవంబర్‌లో అరెస్ట్ అయిన అఫ్తాబ్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటున్నాడు.

Tags:    

Similar News