కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కన్నుమూత..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శుక్రవారం మృతి చెందిన సంఘటన మర్రిగూడ మండల పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2023-06-09 15:44 GMT

దిశ, మర్రిగూడ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శుక్రవారం మృతి చెందిన సంఘటన మర్రిగూడ మండల పరిధిలో చోటుచేసుకుంది. పూర్తివివరాల ప్రకారం మండలంలోని వెంకేపల్లి గ్రామపంచాయతీ చెందిన తుమ్మల మురారి గౌడు (85) శుక్రవారం ఉదయం మృతి చెందాడు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక సభ్యునిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె, భార్య ఉన్నారు. ఆయన మృతి కి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News