22 కేజీల గంజాయి పట్టివేత.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్…

దూల్పేట్ లో అక్రమంగా గంజాయి అమ్మకాలు జరుపుతున్న ఇద్దరు

Update: 2024-10-07 15:30 GMT

దిశ,కార్వాన్ : దూల్పేట్ లో అక్రమంగా గంజాయి అమ్మకాలు జరుపుతున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలిసులు అరెస్ట్ చేసి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సూపరిండెంట్ అంజి రెడ్డి వివరాల ప్రకారం.. దూల్పేట్ లోని లోది కిషోర్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు ఎస్ టి ఎఫ్ టీమ్ దాడులు చేయగా కిషోర్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో 22.9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కిషోర్ సింగ్ తో పాటు జ్యోతి బాయ్ అనే మహిళను కూడా అరెస్ట్ చేశారు. కాగా లడ్డు సింగ్, సాగర్ సింగ్, వైష్ణవి సింగ్,పేపర్ వినోద్ సింగ్ , పరారి లో ఉన్నట్లు ఎక్సైజ్ సూపర్ రెడ్డి టెంట్ ఎస్ టి ఎఫ్ టీం లీడర్ నంద్యాల అంజిరెడ్డి తెలిపారు. ఈ ఆపరేషన్ లో సిఐలు గోపాల్, మధుబాబు, ఎస్సైలు ఉమామహేశ్వరరావు భాస్కర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అజీమ్ శ్రీధర్ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రాకేష్ మహేష్ లు కానిస్టేబుళ్లు ఉన్నారు.

మరో కేసులో....

దూల్పేట్ లోని పురానాపూల్, జియాగూడ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు దాడులు జరిపారు. అభిషేక్ సింగ్, సుభాయ్ సింగులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.560 కేజీల గంజాయి మూడు సెల్ ఫోన్లు,ఒక యాక్టివా బైక్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రోహిత్ యాదవ్, మహేందర్ సింగ్, గుడ్డు సింగ్ తో పాటు గంజాయి తీసుకున్నటువంటి 37 మంది నిందితులను చేర్చినట్లు పోలీసులు తెలిపారు.


Similar News