గుంటూరు పసికందు కిడ్నాప్ కేసు సుఖాంతం

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం కిడ్నాప్ అయిన పసికందును పోలీసులు రక్షించారు.

Update: 2024-10-07 14:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం కిడ్నాప్ అయిన పసికందును పోలీసులు రక్షించారు. పుట్టి ఒక్కరోజు కూడా గడవక ముందే కిడ్నాప్ అయిన మగశిశువును కిడ్నాపర్ల బారినుండి కొద్ది గంటల్లోనే చాకచక్యంగా విడిపించారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గోరంట్లకు చెందిన నసీమా అనే మహిళ ఆదివారం రాత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని మహిళ బాబును ఎత్తుకుంటానని చెప్పి.. ఎవరూ చూడకముందు పసికందును తీసుకొని, అప్పటికే బయట ఆటోలో ఎదురు చూస్తున్న దుండగులతో కలిసి పారిపోయింది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది, తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదు చేసకున్న పోలీసులు, గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల సహాయంతో ఆటో వెళ్లిన మార్గాన్ని గుర్తించి.. నిందితులను పల్నాడు జిల్లాలోని అచ్చంపేటలో అరెస్ట్ చేశారు. కాగా బాబును సత్తెనపల్లి డీఎస్పీ ఆఫీసుకు తరలించారు.


Similar News