శ్రీ కృష్ణా నగల కంపెనీలో రూ.6 కోట్ల ఆభరణాలు మాయం

బంజారాహిల్స్​ లోని శ్రీ కృష్ణా బంగారం నగల కంపెనీలో సుమారు రూ.6 కోట్ల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి.

Update: 2024-10-11 11:16 GMT

దిశ, ఖైరతాబాద్ : బంజారాహిల్స్​ లోని శ్రీ కృష్ణా బంగారం నగల కంపెనీలో సుమారు రూ.6 కోట్ల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని శ్రీకృష్ణా జ్యువెల్ల ర్స్ లో ఇటీవల నిర్వహించిన ఆడిట్లో సుమారు రూ.6 కోట్ల విలువైన ఆభరణాలు మాయమైనట్టు తేలింది. కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు నమ్మించి, సదరు ఆభరణాలను కొంతమంది ఉద్యోగులు మాయం చేసి ఉండొచ్చని సంస్థ మేనేజర్ గతనెల బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థలో పని చేస్తున్న పలువురిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టగా సంస్థలో పనిచే స్తున్న మరో మేనేజర్ సుకేతు షా పాత్ర ఈ వ్యవహారంలో ఉన్నట్టు తేలింది.

    ఈ కేసును రెండు రోజుల కిందట సీసీఎస్​కు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా సుమారు రూ.6 కోట్ల మోసం కేసులో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేతు షా అదృశ్యమయ్యాడు. యాజమాన్యం వేధింపుల కారణంగానే తాను ఇంట్లోంచి వెళ్లిపోతున్నానంటూ వీడియో సందేశం భార్యకు పంపించాడు. దీంతో తన భర్త ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోట్లాది రూపాయల మోసం వ్యవహారంలో ఆరోపణలు ఎదు ర్కొంటున్న శ్రీ కృష్ణా జ్యువెల్లర్స్ మేనేజర్ అకస్మాత్తుగా అదృశ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది. 

Tags:    

Similar News