Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం, పలువురికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని మీర్జాపూర్ (Mirzapur) జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని మీర్జాపూర్ (Mirzapur) లోని కట్కా సరిహద్దులో ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వ్యవసాయ కూలీలు అంతా కలిసి పని నిమిత్తం ట్రాక్టర్‌లో వారణాసి (Varanasi) వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఎదురుగా అతివేగంతో వచ్చిన లారీ అదుపుతప్పి కూలీలు వెళ్తున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా పలువురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.