Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏకంగా 71 మంది జల సమాధి
రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఏకంగా 71 మంది జల సమాధి అయిన హృదయ విదారక ఘటన దక్షిణ ఇథియోపియా (Southern Ethiopia)లోని సిదమా (Sidama) రాష్ట్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఏకంగా 71 మంది జల సమాధి అయిన హృదయ విదారక ఘటన దక్షిణ ఇథియోపియా (Southern Ethiopia)లోని సిదమా (Sidama) రాష్ట్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఓ వివాహా వేడుకకు హాజరైన బృందం తిరుగు ప్రయాణంలో ట్రక్కులో తమ స్వగ్రామానికి బయలుదేరింది. ఈ క్రమంలోనే గెలాన్ వంతెన (Gelan Bridge) వద్దకు రాగానే ట్రక్కు అతివేగంతో అదుపుతప్పి నదిలో పడియింది. ఈ దుర్ఘటనలో 71 మంది అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని లోకల్ పోలీసులు వెల్లడించారు. మృతుల్లో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.