హంతకుల రిమాండ్

కోహీర్ లో సంచలనం రేపిన యువకుడు కట్వాట్ శ్రీకాంత్ అలియాస్ చిన్న(25) హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్ కు తరలించారు.

Update: 2023-05-22 16:55 GMT

దిశ, జహీరాబాద్ : కోహీర్ లో సంచలనం రేపిన యువకుడు కట్వాట్ శ్రీకాంత్ అలియాస్ చిన్న(25) హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్ కు తరలించారు. రిమాండ్ చేసిన వారిలో మాచిరెడ్డిపల్లికి చెందిన పండ్ల వ్యాపారి మహమ్మద్ ఇసాముద్దీన్ (35), జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన మరో పండ్ల వ్యాపారి మహమ్మద్ ఆమెర్ (29) ఉన్నారు.

తరచూ డబ్బు డిమాండ్ చేయడంతో విసుగు చెందిన నిందితులు హత్యకు పాల్పడినట్లు సీఐ తోట భూపతి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. హత్యకు గురైన జహీరాబాద్ పట్టణంలోని ఆర్యనగ్ కు చెందిన కట్వాట్ శ్రీకాంత్ అలియాస్ చిన్న (25) తో నేరస్థులకు గత నాలుగేళ్లుగా మంచ పరిచయాలే ఉన్నాయి. దీంతో హతుడు మద్యం కోసం నేరస్థులను తరచుగా డబ్బు డిమాండ్ చేసేవాడు. ఇవ్వకపోతే వారిని బండ బూతులు తిడుతూ పండ్ల వ్యాపారం చేయకూడదంటూ బెదిరించేవాడు. దీంతో కక్ష పెంచుకున్న ఇసాముద్దీన్, ఆమెర్ లు శ్రీకాంత్ హత్యకు పథకం వేశారు.

నిందితులిద్దరూ కలిసి ప్లాన్ ప్రకారం శ్రీకాంత్ ను శనివారం రాత్రి 10 గంటల తరువాత వారి మోటార్ సైకిల్ పై మాచిరెడ్డిపల్లి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం శ్రీకాంత్ కు ఫుల్ గా మద్యం తాగించారు. రాత్రి దాదాపు తెల్లవారుజాములన 2 గంటల ప్రాంతంలో మత్తులోకి జారుకున్న శ్రీకాంత్ తలపై బండరాయితో మోది హతమార్చారు. అనంతరం ముఖం, ఇతర శరీర భాగాల్లో బీరు బాటిల్ తో పొడిచారు. ఈ కేసులో ఇద్దరు నేరస్థులను అరెస్టు చేసి వారి నుండి ఒక సెల్ ఫోన్, రెండు బైకులు సీజ్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు జహీరాబాద్ టౌన్ సీఐ తోట భూపతి తెలిపారు. హతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని ఆయన వెల్లడించారు. 

Tags:    

Similar News