చోరీ సొత్తు రికవరీ

గత నెలలో మండల కేంద్రంలోని మణికంఠ నగల షాపులో చోరీ జరిగిన సంఘటన విధితమే.

Update: 2025-01-01 15:03 GMT

దిశ, గుండాల : గత నెలలో మండల కేంద్రంలోని మణికంఠ నగల షాపులో చోరీ జరిగిన సంఘటన విధితమే. చోరీ జరిగిన మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకొని వారి వద్ద నుండి చోరీ సొత్తును రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. మండల కేంద్రంలోని మణికంఠ జ్యువెలరీ యజమాని కదిరి శ్రీనివాస్ కు బుధవారం వెండి ఆభరణాలను ఎస్సై రాజమౌళి అందించారు.

    అనంతరం ఎస్సై మాట్లాడుతూ గత నెలలో మండల కేంద్రంలో చోరీ సంఘటన తెలుసుకున్న వెంటనే స్పందించి నిందితులను పట్టుకొని వారి వద్ద నుండి నగలను సైతం స్వాధీనపరుచుకున్నామని తెలిపారు. అనుమానిత వ్యక్తులు గ్రామంలో కానీ, మండలంలో కానీ సంచరిస్తే పోలీస్ వారికి తెలియపరచాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ లు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని స్థానిక ఎస్సై రాజమౌళి పేర్కొన్నారు. 


Similar News