సైబర్ పీఎస్ ఎదురుగా క్యూనెట్ బాధితుల ఆందోళన

తమకు న్యాయం చెయ్యాలంటూ క్యూనెట్ భాదితులు గురువారం బషీర్ బాగ్ లోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళన చేశారు.

Update: 2023-05-18 12:49 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తమకు న్యాయం చెయ్యాలంటూ క్యూనెట్ భాదితులు గురువారం బషీర్ బాగ్ లోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళన చేశారు. దండిగా లాభాలు ఇస్తామని సంస్థ నిర్వాహకులు ఒక్కొక్కరి నుంచి 2 మొదలుకొని 5 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పారు. తమలో ఆరుగురు సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని క్యూనెట్ ఆఫీస్ లో పనిచేస్తూ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. క్యూనెట్ కు చెందిన 137 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారన్నారు.

అయితే, మోసపోయిన తమలో ఏ ఒక్కరికీ న్యాయం చెయ్యలేదని చెప్పారు. మరోవైపు అరెస్ట్ అయిన నిందితులు బెయిల్ పై బయటకు వచ్చారన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని 300 మంది బాధితులకు న్యాయం చెయ్యాలని కోరారు. బాధితులకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు.

Tags:    

Similar News