శృంగార లాడ్జి.. ఒకేసారి ముగ్గురు అమ్మాయిలతో.. (వీడియో)

ఈజీగా డబ్బులు సంపాదించేందుకు కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేస్తున్నారు.

Update: 2022-12-06 16:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈజీగా డబ్బులు సంపాదించేందుకు కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేస్తున్నారు. అందమైన యువతులకు డబ్బుల ఎర వేసి వారానికి ఇంత అంటూ రేటు కట్టి వ్యభిచారంలోకి దింపుతున్నారు. గుంటూరు జిల్లాలోని లాడ్జీల్లో విచ్చలవిడిగా ఈ సెక్స్ మాఫియా జరుగుతున్నా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. మంగళవారం ఓ లాడ్జిలో ముగ్గురు యువతులతో రేటు మాట్లాడుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గుంటూరు నగరంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 60 లాడ్జిల వరకు ఉండగా.. వాటిల్లో 15 లాడ్జీల్లో జోరుగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల దీనిపై సమాచారం అందుకున్న నగర ఎస్పీ.. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పోలీసులు తూతూమంత్రంగా దాడులు నిర్వహించి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యభిచార దందాతో సంబంధం ఉందని ఓ స్టేషన్ రైటర్‌‌పై ఎస్పీ వేటు వేశారు. ఇది జరిగి వారం రోజులు కూడా గడవక ముందే మళ్లీ అదే స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జీలో ముగ్గురు యువతులతో వ్యభిచారం చేయిస్తుండటం కలకలం రేపుతోంది. యువతుల్లో ముగ్గురు పశ్చిమ గోదావరి, ఓ మహిళ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వీరికి 'వారానికి ఇంత' అని రేటు మాట్లాడుకుని లాడ్జి నిర్వహకులే రప్పించుకుని వ్యభిచారం చేయిస్తున్నట్లు బయటపడింది.

మంగళవారం ఓ లాడ్జికి వెళ్లిన ముగ్గురు యువకులు ముగ్గురు అమ్మాయిలు కావాలని అక్కడి నిర్వహకుడితో బేరాలు ఆడుతూ వీడియో తీశారు. పక్కన్నే యువతులను చూపిస్తూ రేటు మాట్లాడుకోవడం.. ఓ మహిళ కూడా సీన్‌లోకి ఎంట్రీ కావడం వీడియోలో కనిపిస్తోంది. అయితే యువతులతో వారం రోజులపాటు ఒళ్లు హూనం అయ్యేలా వ్యభిచారం చేయించి అందుకు తగిన విధంగా డబ్బులు కూడా ఇవ్వడం లేదని గతంలో పోలీసులు విచారణలో బయటపడింది. ఒకే గదిలో ముగ్గురు, నలుగురిని ఉంచి పరదాల మాటున ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇంత బహిరంగంగా ఈ సెక్స్ దందా జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడానికి వారికి అందే ముడుపులే కారణమని పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు.  

డేటింగ్ యాడ్ ఇచ్చిన ఇద్దరు పిల్లల తల్లి.. సరికొత్త ట్రెండ్

కూతురిని కాదని తల్లిపై కన్నేసిన కుర్రాళ్లు.. దారుణంగా పోలుస్తూ 


Similar News