ఓయో రూంలో ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
రామంతపూర్ ఓయో రూంలో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న
దిశ,ఉప్పల్:రామంతపూర్ ఓయో రూంలో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.వివరాల్లోకి వెళితే బోరబండకు చెందిన ఓంకార్, జనగాం కు చెందిన యువతి కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ప్రైవేట్ బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్నారు.ఈ యువతి ఉప్పల్ లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది. రామంతపూర్ ప్రగతి నగర్ లోని ఓయో రూంలో ఆదివారం సాయంత్రం ప్రేమజంట రూమ్ తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రియుడు ఓంకార్ రూమ్ లో ఉన్న ఫ్యాన్ కి ప్రియురాలి చున్నీతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రియురాలు వెంటనే ఓయో సిబ్బంది కి చెప్పడంతో అతనిని వెంటనే పక్కకు ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.ఇద్దరు మద్యం సేవించారని సమాచారం. ఓంకార్ పరిస్థితి విషమంగా ఉంది.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.