అంధ బాలిక హత్యకేసులో కీలక మలుపు.. నిందితుడు రాజు అరెస్ట్
కంటిచూపు కనబడని మైనర్ బాలికను అత్యంత దారుణంగా హత్య చేసిన ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : కంటిచూపు కనబడని మైనర్ బాలికను అత్యంత దారుణంగా హత్య చేసిన ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రాజు మద్యం మత్తులోనే బాలికను హత్య చేశారని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈ మేరకు ముద్దాయి డు కుక్కల రాజును అడిషనల్ ఎస్పీ సుప్రజ, డీఎస్పీ రాంబాబు, సీఐ శేషగిరిరావులతో కలిసి ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం విచారణకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్ కరకట్ట ముద్దాయి, హతురాలు గత కొద్దికాలంగా పక్క పక్కనే కలిసి నివాసం ఉంటున్నారు అని తెలిపారు. అయితే మృతురాలి పట్ల ముద్దాయి కుక్కల రాజు అసభ్యంగా ప్రవర్తించాడని దీంతో మృతురాలు కుటుంబ సభ్యులకు తెలియజేసిందని వెల్లడించారు.
కుటుంబ సభ్యులకు తనపై ఫిర్యాదు చేయడంతో తట్టుకోలేకపోయిన రాజు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. మద్యం సేవించి మృతురాలి మెడపై కత్తితో దాడి చేసి హతమార్చాడని తెలిపారు. మద్యం మత్తులోనే హత్య చేశాడని వివరించారు. ముద్దాయిపై సామాజిక మాధ్యమాల్లో గంజాయి సేవించినట్లు, రౌడీ షీట్ ఉన్నట్లు కథనాలు వస్తున్నాయని అవి వాస్తవం కాదన్నారు. నిందితుడు గంజాయి సేవించలేదని వివరణ ఇచ్చారు. అలాగే నిందుతుడిపై ఎటువంటి రౌడీ షీట్ లేదు అని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటించారు. నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు.