కోడి పందెం స్థావరంపై పోలీస్​ల దాడి

మండల పరిధిలోని గుంటుపల్లి గోపవరంలో బుధవారం కోడి పందేలను నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం తెలుసుకున్న ఎస్సై పి.వెంకటేష్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు.

Update: 2025-01-01 12:32 GMT

దిశ, ఎర్రుపాలెం : మండల పరిధిలోని గుంటుపల్లి గోపవరంలో బుధవారం కోడి పందేలను నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం తెలుసుకున్న ఎస్సై పి.వెంకటేష్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. పది మంది కోడి పందెం రాయుళ్లతో పాటు, రెండు కోడి పుంజులను, నాలుగువేల రెండు వందల రూపాయల నగదును, ఎనిమిది బైక్ లను పట్టుకుని సీజ్ చేసి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.


Similar News