పగలు రెక్కీ.. రాత్రి చోరీ..

Update: 2023-03-06 15:05 GMT

దిశ, ఎల్బీనగర్: పగలు రెక్కీ నిర్వహించి రాత్రి పూట తాను దొంగిలించిన వాహనంపై దొంగతనాలు చేసే వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సాయి శ్రీ వివరాలు వెల్లడించారు. ఇబ్రహీం పట్నం నియోజకవర్గ పరిధిలోని ఇంజాపూర్ లో నివాసం ఉంటున్న సాయి కుమార్ నాయక్ స్వస్థలం నల్గొండ జిల్లా, దేవరకొండ. పదవ తరగతి వరకు చదివి జోమాటో లో పనిచేసేవాడు. సులభంగా డబ్బు సంపాదన కోసం రాత్రి పూట తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడి ఇండ్లలో ఉన్న విలువైన వస్తువులు, బంగారం చోరీ చేసేవాడు.


వాహనాల తనిఖీలో భాగంగా అతని వద్ద ఉన్న నెంబర్ ప్లేట్ లేని వాహనాన్ని అదుపులోకి విచారణ చేయగా.. చోరీకి గురైన వాహనంపై చోరీలకు పాల్పడే వాడని విచారణలో తేలింది. ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలో, వనస్థలిపురం లో 3 కేసులు, పంజాగుట్ట లో ఒక కేసు ఉన్నట్లు తెలిపారు. పాత నేరస్తుడు కావడంతో మొత్తం 5 కేసులు ఛేదించినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 85 గ్రాముల బంగారం,150 గ్రాముల వెండి, 3 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాటి విలువ రూ. 7 లక్షల రూపాయల ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ జోన్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, ఇన్ స్పెక్టర్ అంజి రెడ్డి, ఎస్సైలు ప్రభు లింగం, నరేందర్, సిబ్బంది యాదగిరి, జంగయ్య, శ్రీను, బిక్షం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News