లిఫ్ట్ కూలి రోగి మృతి..

ఖమ్మం నగరంలో ప్రైవేట్ ఆస్పత్రిలో లిఫ్ట్ కూలి రోగి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

Update: 2025-03-21 15:38 GMT
లిఫ్ట్ కూలి రోగి మృతి..
  • whatsapp icon

దిశ, ఖమ్మం : ఖమ్మం నగరంలో ప్రైవేట్ ఆస్పత్రిలో లిఫ్ట్ కూలి రోగి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ముదిగొండ మండలంలోని వనం వారి కృష్ణా పురం గ్రామానికి చెందిన సరోజ నగరంలోని ప్రసూన ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన సమస్యతో ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. వైద్యులు గుండెకు స్టంట్ లు వేసి క్యాప్ లాబ్ నుండి బయటకు తీసుకొచ్చి లిఫ్ట్ ద్వారా ఎం ఐ సి యు కు తరలించే క్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో ఆమె మృతి చెందింది. లిఫ్ట్ సాంకేతిక కారణాల వల్ల ఇలాంటి సమస్య తలెత్తిందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నారు. రోగితోపాటు ఆసుపత్రి సిబ్బంది కూడా లిఫ్ట్ లో ఉన్నట్లు సమాచారం.


Similar News