కిడ్నీ విప్పిన గుట్టు.. చెల్లిని పెళ్లి చేసుకుని ఇద్దరిని కన్న సొంత అన్న..
సమాజంలో ఉన్న పవిత్ర బంధాలలో రక్త సంబంధం ఒకటి. అందులో అన్నాచెల్లెల్లు అంటే.. అన్న తన చెల్లిలో రెండో అమ్మను చూసుకుంటాడు.
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో ఉన్న పవిత్ర బంధాలలో రక్త సంబంధం ఒకటి. అందులో అన్నాచెల్లెల్లు అంటే.. అన్న తన చెల్లిలో రెండో అమ్మను చూసుకుంటాడు. కానీ అలాంటి పవిత్ర బంధానికి దారుణం జరిగింది. ఓ వ్యక్తికి పెళ్లై 6 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉన్న వీరి జీవితాల్లో ఓ దారుణ నిజం వెలుగు చూసింది. తన భార్యకి అనారోగ్య సమస్య ఎదురైంది. దానికోసమని టెస్ట్‌లు చేపిస్తే భార్యాభర్తలు జీర్ణించుకోలేని నిజం బయటపడింది. ఆ నిజం ఏంటంటే.. తన భార్య అతని సొంత చెల్లెలు అని తెలిసింది. మరి తన చెల్లినే అతడు పెళ్లి ఎలా చేసుకున్నాడు..? ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ నిజం బయటకు వచ్చిందో తెలుసుకుందాం...
తనకు ఎదురైనా ఈ దారుణ నిజం గురించి ఆ వ్యక్తి రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన స్టోరీ వివరాల ప్రకారం.. ఆ వ్యక్తికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు నలుగురు ఎంతో సంతోషంతో జీవితాన్ని సాగిస్తున్నారు. అంతలోనే వీరి ఆనందానికి అనారోగ్యం అడ్డుగా మారింది. తన భార్యకు కిడ్నీ సమస్య వచ్చింది. వైద్యులు చూసి కిడ్నీ మార్పిడి చేయాలని అన్నారు. ఈ క్రమంలోనే భార్య తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అందరికి టెస్ట్‌లు చేశారు. కానీ.. ఎవరి కిడ్నీ ఆమెకు మ్యాచ్ కాలేదు. ఇక తన భార్యను కాపాడుకోవాలని భర్త కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. దీంతో టెస్ట్‌లు నిర్వహించగా అతడి కిడ్నీ మ్యాచ్ అయింది. ఈ మేరకు మరిన్ని టెస్టులు నిర్వహించారు వైద్యులు. అయితే వైద్య పరీక్షల్లో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి.
అదేంటంటే.. ఆ వ్యక్తి, తన భార్య ఇద్దరు సొంత అన్నాచెల్లెల్లు. మరి పెళ్లి ఎలా జరిగింది అనుకుంటున్నారా.. ఆ వ్యక్తిని పుట్టిన కొన్ని రోజులకే వేరే వాళ్లకు దత్తతు ఇచ్చారు. ఇక అప్పటినుంచి అతడికి తనను కన్నవాళ్లకి ఎలాంటి సంబంధం లేదు. దీంతో తన చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లై ఇద్దరు బిడ్డలు ఉన్న తర్వాత అతడికి ఈ విషయం తెలిసింది. ఇక ఈ పరిస్థితిని తను ఎలా ఎదుర్కోవాలో తెలియక తన స్టోరిని రెడ్డిట్‌లో పోస్ట్ చేసి సలహా అడుగుతున్నాడు. ఇది విన్న కొంత మంది.. మీకు తెలియకుండా తప్పు జరిగింది. కానీ ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. అలాగే ఉండండని కొందరు సలహాలు ఇస్తుంటే.. మరికొందరు మాత్రం ఎంత కాదనుకున్నా తను చెల్లి అవుతుంది అనే విషయం పదే పదే గుర్తుకు వస్తుంది కదా.. చెల్లితో కాపురం అనే ఊహను కూడా తట్టుకోలేం.. మీ సమస్యలకు పరిష్కారం అంత సులుభం కాదు అంటూ రిప్లైలు ఇస్తున్నారు.