కారు, మిల్క్ డైరీ వ్యాన్ ఢీకొని ఒకరు మృతి
కారు, మిల్క్ డైరీ వ్యాన్ ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ,సత్తుపల్లి: కారు, మిల్క్ డైరీ వ్యాన్ ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మున్సిపాలిటీ లోని కాకర్లపల్లి రోడ్డుకు చెందిన అడపా రాజేంద్రప్రసాద్ పుష్పవతి కారులో అశ్వారావుపేట కు వెళ్లి వస్తుండగా సత్తుపల్లి నుంచి అశ్వరావుపేట వైపు వెళ్తున్న మిల్క్ డైరీ వ్యాన్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారులో ఉన్న భార్య భర్తలు అడపా రాజేంద్రప్రసాద్, పుష్పవతి లకు తీవ్ర గాయాలవగా 108 లో సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తుండగా అడపా పుష్పవతి(55) మృతి చెందింది. వీరి ఇంట్లో గత శనివారం కూతురు వివాహం చేయగా నూతన దంపతులను ఆశీర్వదించడానికి వెళ్లి వస్తుండగా ప్రమాదంలో పుష్పావతి మరణించడంతో నూతన దంపతులకు మధ్య విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.