వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

కొత్తచెరువు నాగుల కనుమ దగ్గర చెరువులో ఆత్మహత్యకు ప్రయత్నించిన వృద్ధురాలు బోయ గంగమ్మను పోలీసులు గుర్తించి రక్షించారు.

Update: 2024-11-09 13:06 GMT

దిశ ప్రతినిధి, కొత్తచెరువు: కొత్తచెరువు నాగుల కనుమ దగ్గర చెరువులో ఆత్మహత్యకు ప్రయత్నించిన వృద్ధురాలు బోయ గంగమ్మను పోలీసులు గుర్తించి రక్షించారు. నాగుల కనుమ దగ్గర అనుమానాస్పదంగా ఉన్న వృద్ధురాలిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు భాస్కర్, మారుతి అక్కడికి చేరుకుని వృద్ధురాలిని విచారించారు. రొద్దం మండలం పెద్దకోడిపల్లి నివాసిగా వృద్ధురాలు తెలిపారు. 80 ఏళ్ల వయస్సున్న తనకు కళ్లు సరిగ్గా కనిపించవని.. జీవితంపై విరక్తి చెంది చనిపోవాలని నిర్ణయించుకుని ఇక్కడికి చేరుకున్నట్లు వారికి వివరించింది. వెంటనే పోలీసులు వృద్ధురాలికి నచ్చజెప్పి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకుని వృద్ధురాలిని రక్షించడం పై స్థానికులు హర్షించారు.


Similar News