Big Alert:వాట్సాప్ యూజర్లే టార్గెట్.. సైబర్ క్రిమినల్స్ కొత్త స్కామ్
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ(Technology) ఎంతగా అభివృద్ది చెందిందో చూస్తూనే ఉన్నాం.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ(Technology) ఎంతగా అభివృద్ది చెందిందో చూస్తూనే ఉన్నాం. ప్రజెంట్ జనరేషన్‌లో చిన్న పెద్ద తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రోజురోజుకూ సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్(Cyber criminals) రెచ్చిపోతున్నారు. సరికొత్త టెక్నాలజీ(Technology)ని అందిపుచ్చుకొని సైబర్ నేరగాళ్లు యూజర్లను ట్రాప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అలాంటి స్కామ్‌లను ఎన్నో చూస్తునే ఉన్నాం. ఈ-మెయిల్స్ పంపించడం.. ఫోన్లు చేయడం.. బ్యాంకు వివరాలు అడగడం.. మెసేజ్‌లు పంపించడం లాంటి స్కామ్‌లు ఎన్నో జరుగుతున్నాయి. ఈ క్రమంలో సైబర్ క్రిమినల్స్(Cyber criminals) మరోసారి వాట్సాప్ యూజర్ల(WhatsApp users)ను టార్గెట్ చేశారు. అయితే.. పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. వేలాదిగా జంటలు పెళ్లి పీటలు ఎక్కనున్నాయి. ఇదే అదునుగా సైబర్ క్రిమినల్స్ పాత APK స్కామ్‌నే మళ్లీ కొత్తగా మొదలుపెట్టారు. తెలియని ఫోన్ నెంబర్ నుంచి మీ వాట్సాప్‌కు పెళ్లి ఇన్విటేషన్(Wedding invitation) పంపిస్తారు. అందులో APK ఫైల్ ఉంచుతారు. దాన్ని తెరవగానే మీ మొబైల్లో సీక్రెట్‌గా ఇన్‌స్టాలై బ్యాంకు, పర్సనల్ డేటాను దొంగిలిస్తుంది. దీని ఆధారంగా క్రిమినల్స్ మీ బ్యాంకులోని డబ్బును దోచుకుంటారు.