Crime News : రాత్రైతే రచ్చరచ్చే.. బెడ్‌రూంలో నవ వధువు చేష్టలకు భర్త హడల్

ఓ నవ వధువు భర్తకు చుక్కలు చూపించింది. రాత్రైతే చాలు.. భార్య తన విశ్వరూపం చూపించేది.

Update: 2022-08-22 11:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఓ నవ వధువు భర్తకు చుక్కలు చూపించింది. రాత్రైతే చాలు.. భార్య తన విశ్వరూపం చూపించేది. ఆమె టార్చర్ భరించలేని అతడు ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. పెళ్లైన నెల రోజులకే ఈ సంఘటన జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఆ పెళ్లి కూతురు ఏం చేసిందంటే..

రాజస్థాన్‌లోని అలీగఢ్ సమీపంలోని జట్టారికి చెందిన ఓ వ్యక్తికి నెల రోజుల క్రితం ఓ యువతితో వివాహం అయింది. చూడటానికి ముద్దుగుమ్మలా ఉన్న ఆమెను ఆ యువకుడు పట్టుబట్టి మరీ వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లైన వారం రోజులకే భార్య రాక్షసతత్వం బయటపడింది. ఆమెకు మద్యం, గంజాయి సేవించే అలవాటు ఉందని తెలిసింది. దీంతో రోజూ రాత్రి మద్యం లేనిదే ఆమెకు నిద్ర పట్టేది కాదు.. దీంతో భర్తను మద్యం తేవాలని పోరుపెట్టేది. మొదట కొత్త పెళ్లి కూతురు అనే మురిపెంలో ఉన్న భర్త.. ఆమెకు అన్నీ సమకూర్చేవాడు.

అయితే మద్యం మత్తులో భార్య బెడ్ రూంలో అతిగా ప్రవర్తించేది. భర్తను ఎక్కడపడితే అక్కడ కొరకడం.. కొట్టడం.. శృంగారంలోనూ అసభ్యంగా ప్రవర్తించడం చేస్తుండటంతో రాత్రి అవుతుందంటనే భర్త హడలిపోయే వాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా ఆమె మద్యం మత్తులో రెచ్చిపోయి భర్తను ఛాతీ, తొడలు, చేతులపై బలంగా కొరికింది. ఆపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతడు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో భార్య టార్చర్ వెలుగు చూసింది. అయితే పోలీసుల విచారణలో.. ఆమెకు పెళ్లికి ముందు నుంచే మద్యం, గంజాయి సేవించడం అలవాటు ఉందని తేలింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నవ వధువును అరెస్ట్ చేశారు.


Similar News