మోటార్ దొంగలు అరెస్ట్
మోటార్ దొంగలను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
దిశ, ఖమ్మం రూరల్ : మోటార్ దొంగలను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో గల మున్నేరు యేటి ఓడ్డున కొంత మంది దొంగలు శుక్రవారం తెల్లవారుజామున మొటార్లను చోరీ చేసే ప్రయత్నం చేస్తుండగా అటుగా వస్తున్న ఆయ్యప్పస్వాములు గమనించి వెంబడించి వారిని పట్టుకుని స్థానికులకు అప్పగించారు.
ఇప్పటికే మున్నేటి ఒడ్డున సుమారు వందల సంఖ్యలో మోటార్లు చోరీకి గురైనట్లు రైతులు వాపోతున్నారు. మోటార్లు, పంప్సెట్లు, కొత్త ఇంట్లో కాపర్ వైర్లు సైతం చోరీకి గురైనట్లు స్థానికులు తెలిపారు. పట్టుబడ్డ దొంగలను తీర్థాలకు చెందిన గ్రామస్తులు రూరల్ పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ దొంగలు దానవాయిగూడెం కాలనీకి చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. దీని పై పోలీసులను సమాచారం అడగ్గా దొంగులు పట్టుబడ్డది వాస్తవమేనని, విచారిస్తున్నట్లు సీఐ ఎం. రాజు తెలిపారు.