నేలకొరిగిన మావోయిస్టు నేత సారయ్య
దండకారణ్యంలో సుదీర్ఘకాలం మావోయిస్టు కీలక నేతగా పనిచేసిన వరంగల్ వాస్తవ్యుడు అంకేశ్వరాపు సారయ్య సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.

దిశ, వరంగల్ బ్యూరో : దండకారణ్యంలో సుదీర్ఘకాలం మావోయిస్టు కీలక నేతగా పనిచేసిన వరంగల్ వాస్తవ్యుడు అంకేశ్వరాపు సారయ్య సోమవారం జరిగిన ఎన్‌కౌం టర్‌లో మృతి చెందారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన అంకేశ్వరాపు సారయ్య అలియాస్ సుధాకర్ అలియాస్ సుధీర్ అలియాస్ మురళి ముప్పై ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లారు. దండకారణ్యంలో స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ గా, దంతెవాడ ఏరియా కమిటీలో కమాండర్‌గా పనిచేస్తున్న అంకేశ్వరపు సారయ్య సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. సారయ్యపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. ఆయన మృతితో తరాలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.