బాలికల అసభ్య వీడియోలు తీసి వెబ్‌సైట్లకు.. వ్యక్తి అరెస్ట్

బాలికల అసభ్య వీడియోలను తీసి వెబ్ సైట్లకు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2022-12-03 04:09 GMT

దిశ, వెబ్ డెస్క్: బాలికల అసభ్య వీడియోలను తీసి వెబ్ సైట్లకు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచ్చి జిల్లా మనప్పారై పూమాలైపట్టికి చెందిన రిటైర్డ్ ఆరోగ్య ఉద్యోగి కుమారుడు రాజా లండన్ లో కొన్నేళ్ల పాటు ఉండి వచ్చాడు. తిర్పూర్ లో జౌళి దుకాణం నడుపుతున్నారు. బాలికలను మభ్యపెట్టి అసభ్య చిత్రాలను వీడియోలుగా తీసి లండన్ తో పాటు ఇతర దేశాలలో నిర్వహించే వెబ్ సైట్ లకు పంపుతున్నాడు. తద్వరా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నట్లు సీబీఐకి ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన సీబీఐ రాజా ఇంట్లో శుక్రవారం తనిఖీలు చేపట్టారు. బాలికల అసభ్య ఫోటోలు, వీడియోలను రికార్డు చేసినట్లు గుర్తించారు. రాజా సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. రాజాకు పెద్ద నెట్ వర్క్ ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. 


Also Read.......

HYD సెంట్రల్ యూనివర్సిటీ : విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం

Tags:    

Similar News