జోరు తగ్గని ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా

ఉప్పల్ లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా జోరు తగ్గలేదు.

Update: 2025-03-22 15:54 GMT
జోరు తగ్గని ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా
  • whatsapp icon

దిశ,ఉప్పల్ : ఉప్పల్ లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా జోరు తగ్గలేదు. ఆదివారం జరిగే సన్​రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్​ మ్యాచ్ కి శనివారం ఉదయం 4 టికెట్లతో భరద్వాజ్ అనే యువకుడు పట్టుబడగా సాయంత్రం మరో ఇద్దరు వ్యక్తులు ఐదు టికెట్లతో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు చిక్కారు. పోలీస్ అధికారులు ఎంత అవేర్నెస్ కల్పించినా బ్లాక్ టికెట్ల దందా మాత్రం ఆగడం లేదు. ఉప్పల్ చౌరస్తా వద్ద సాయంత్రం సంపత్, హరి అనే ఇద్దరు వ్యక్తులు బ్లాక్ టికెట్లు అమ్ముతుండగా ఎల్బీనగర్ ఎస్ ఓటీ పోలీసులు పట్టుకొని ఐదు టికెట్లతో సహా ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. నిందితులు సంపత్, హరిలపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News