HYD: కొండాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్(Hyderabad) శివారులోని కొండాపూర్(Kondapur)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) శివారులోని కొండాపూర్(Kondapur)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం రాజరాజేశ్వరి కాలనీలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్(Galaxy Apartment)లో మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్ చివరి అంతస్తులోని ఫ్లాట్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్(Gas cylinder) పేలి మంటలు వ్యాపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్లాట్‌లో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పిందని భావిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.