తనకంటే పదేళ్లు పెద్దా.. అయినా అతడిని పెళ్లి చేసుకున్నా కూడా...

దిశ, వెబ్ డెస్క్: పెళ్లయిన మూడు నెలలకే ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో...housewife died suspiciously three months after her marriage in karnataka

Update: 2022-08-14 02:37 GMT

దిశ, వెబ్ డెస్క్: పెళ్లయిన మూడు నెలలకే ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా మియాపూర్ కు చెందిన రూప అనే యువతి వయస్సు 22 ఏళ్లు. అయితే అదే ప్రాంతానికి చెందిన గంగాధర్ అనే 32 ఏళ్ల వయస్సున్న వ్యక్తికి ఆ యువతినిచ్చి పెళ్లి చేశారు. కట్నకానుకలు కూడా బాగానే ఇచ్చారు. అయితే, పెళ్లి అయిన కొద్ది రోజులకే అత్తింటివారి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభమయ్యాయి.

మూడు తులాల బంగారం కట్నంలో తక్కువగా పెట్టారంటూ వేధించడం, చేయి చేసుకోవడం వంటి చేశారు. భర్తకు చెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది. భర్త కూడా ఆమెపై రోజూ చేయిచేసుకునేవాడు. దీంతో ఆ యువతి మనస్తాపం చెంది విషం తాగింది. తన భార్య చనిపోతే తమకు ఇబ్బందులు తప్పవని ఆమె భర్త గంగాధర్, అతని కుటుంబ సభ్యులు రూపను ఆస్పత్రిలో చేర్పించారు. 2 రోజుల తర్వాత రూప తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

రూప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తూ కన్నీటిపర్యమంతమయ్యారు. తమ కూతురు చావుకు భర్త, అత్తింటివారే అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు అంటూ కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

కొత్త పెళ్లి జంటలకు కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 


Similar News