ఉరేసుకుని మాజీ ఎంపీటీసీ బలవన్మరణం

ఉరేసుకుని మాజీ ఎంపీటీసీ బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎండపల్లి మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

Update: 2023-05-28 14:36 GMT
ఉరేసుకుని మాజీ ఎంపీటీసీ బలవన్మరణం
  • whatsapp icon

దిశ, వెల్గటూర్ : ఉరేసుకుని మాజీ ఎంపీటీసీ బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎండపల్లి మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. గత దఫాలో కొండాపూర్, అంబారిపేట గ్రామాల ఎంపీటీసీగా గెలుపొందిన ఇప్పల లక్ష్మి (60) గ్రామానికి మంచి సేవలందించారు. ఏడాది కాలంగా ఆమె వెన్నముక వ్యాధితో బాధపడుతున్నారు. భర్త లచ్చయ్య కూడ తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మి ఒకనోక దశలో తనకు చావు ఎప్పుడు వస్తుందా.. అని రోదిస్తూ ఉండేదని తెలిపారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి కలిగి ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి కుటుంబాన్ని మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Tags:    

Similar News