కరెంట్ షాక్ తో గ్రామపంచాయతీ కార్మికుడు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చింతల్ తండా గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్న బానోతు తరుణ్ (23) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.
దిశ,జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చింతల్ తండా గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్న బానోతు తరుణ్ (23) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. గ్రామంలో విద్యుత్ తీగల కొమ్మలు అడ్డు వస్తున్నాయని వాటిని నరికేందుకు ప్రయత్నిస్తుండగా కొమ్మ తెగి 11 కేవీ వైర్లపై పడడంతో కొమ్మని ఆనుకొని ఉన్న తరుణ్ కు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. తరుణ్ నాలుగు సంవత్సరాలుగా పంచాయతీ వర్కర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి ఆరు నెలల క్రితం వివాహమైంది.