ప్రియురాలి బంధువులు మందలించారని ఆత్మహత్య

జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన పవన్ (26) మంగళవారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Update: 2025-01-01 14:15 GMT

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన పవన్ (26) మంగళవారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోరుట్లలోని తాండ్రియాల ఎస్బీఐ బ్యాంకులో పవన్ ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా పవన్ కోరుట్లకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఆ అమ్మాయి బంధువులు మందలించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News