ప్రియురాలి కోసం స్నేహితుడి హత్య...

ప్రియురాలితో చనువుగా ఉంటున్నాడని తెలిసి తన స్నేహితుడిని అతికిరాతంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట శివారులో చోటు చేసుకుంది.

Update: 2023-02-25 16:25 GMT

దిశ, అబ్దుల్లాపూర్మెట్ : ప్రియురాలితో చనువుగా ఉంటున్నాడని తెలిసి తన స్నేహితుడిని అతికిరాతంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట శివారులో చోటు చేసుకుంది. స్నేహితుడి పై కత్తితో దాడి చేసి వివస్త్రగా మార్చి శరీర భాగాలు సపరేటుగా చేసి మరీ రాక్షసానందం పొందాడు. బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ మూసారాంబాగ్ ప్రాంతానికి చెందిన పేరాల హరికృష్ణ తన స్నేహితుడు నవీన్ (20)లు ఇంటర్మీయట్ నుంచి స్నేహితులు కాగా అదే కళాశాలలో చదువుతున్న ఓ అమ్మాయిని హరిహర కృష్ణ ప్రేమించాడు. కొన్ని కారణాల వల్ల విడిపోయారని, దీన్ని అనువుగా తీసుకున్న నవీన్ అనే యువకుడు అమ్మాయితో చనువుగా ఉంటున్నాడు.

దీన్నీ సహించలేని హరిహరకృష్ణ కోపాద్రిక్తుడయ్యాడు. దీంతో పలుమార్లు నవీన్ ను హత్య చేసేందుకు మూడునెలలుగా ప్రయత్నం చేశాడు. సమయం కోసం వేచి చూసిన హరిహరకృష్ణ ఈ నెల 17వ తేదీన నవీన్ ను ఎల్బినగర్లో కలుసుకుని స్థానికంగా ఉన్న పలు ప్రాంతాలను కలిసి తిరిగారు. అనంతరం ముసరంబాగ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ రాత్రి కాగానే నవీన్ వెళ్తానని చెప్పుగా శ్రీహరి తనబైక్ మీద పెద్ద అంబర్పేట పరిసరాలకు చేరుకోగానే అమ్మాయి విషయంలో గొడవ పడ్డారని, దీంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెల్లి తనవెంట తెచ్చుకున్న కత్తితో దాడిగి దిగాడు.

వీన్ చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం నవీన్ శరీర భాగాలను, ప్రైవేటు భాగాలను చేతి వేళ్లను, గుండెను సైతం కోసి తనప్రియురాలైన యువతి ఫోన్ కు ఫోటొలు పంపినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడని, స్నేహితులు, బంధువుల, పోలీసుల ఒత్తిడిని తట్టుకోలేక శుక్రవారం రాత్రి అబ్దుల్లాపూర్మెట్ పోలీసుస్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. వివరాలు సేకరించిన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి అప్పటికి కుల్లిపోయినట్లుగా ఉన్నశవాన్నీ పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా నిందితుడి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో హరిహరకృష్ణ ప్రియురాలిని నిందితురాలిగా చేర్చినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆదే కాకుండా హరిహరకృష్ణ ఒక్కరే ఈ దారుణంలో ఉన్నారా లేక అతనికి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో కేసునమోదు చేసుకున్నట్లు సమాచారం. నిందితుడు హరిహరకృష్ణ పై 302, 201, 5(2)వి, ఎస్సీ, ఎస్టీ, పీవోటి, యాక్ట్ 2015 సక్షన్ల కింద కేసులునమోదు చేశారు. పొలీసు స్టేషన్లో నిందితుడు హరిహరకృష్ణ లొంగిపోయాడని తెలుసుకున్న నవీన్ కుటుంబసభ్యులు శనివారం ఉదయం పెద్ద ఎత్తున అబ్ధుల్లాపూర్మెట్ పొలీసు స్టేషన్ కు తరలివచ్చారు. నిందితుడిని తమకు అప్పగించాలని, బాధిత కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళనలు చేస్తున్న వారిని అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు.

Tags:    

Similar News