Fraud :పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు...మోసం చేశాడు

నమ్మించి పెళ్లి చేసుకుంటానని ట్రాన్స్​ జెండర్ (Transgender)ను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన మంగళవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2024-10-29 16:04 GMT

దిశ, అల్వాల్ : నమ్మించి పెళ్లి చేసుకుంటానని ట్రాన్స్​ జెండర్ (Transgender)ను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన మంగళవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కానాజీగూడలో నివాసం ఉండే హరీష్(30) స్థానికంగా నివాసముండే ట్రాన్స్ జెండర్ లాస్య(25)తో ఐదు సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. లాస్య ఇటీవల హరీష్ పై పెళ్లి గురించి ఒత్తిడి తేవడంతో ముఖం చాటేశాడని, దీంతో తాను మోసపోయానని (I was cheated)భావించిన లాస్య అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News