Fire Accident: తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లల్లో ఆస్తి నష్టం

భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన తమిళనాడు రాష్ట్రం (Tamilnadu State)లోని కృష్ణగిరి జిల్లా (Krishnagiri District) పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

Update: 2024-09-28 03:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన తమిళనాడు రాష్ట్రం (Tamilnadu State)లోని కృష్ణగిరి జిల్లా (Krishnagiri District) పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని హోసూరులో ఉన్న సెల్‌ఫోన్ తయారీ కంపెనీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున కంపెనీలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో మంటలు కంపెనీ మొత్తానికి వ్యాపించాయి. సిబ్బంది సమాచారం మేరకు స్పాట్ చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలార్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ.కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినట్లుగా కంపెనీ యాజమాన్యం తెలిపింది.     


Similar News