కన్న కూతురిపై తండ్రి దారుణం.. 36 ఏళ్లుగా గదిలో బంధించి..
సమాజంలో అమానుష ఘటనలు రోజురోజకూ పెరిగిపోతున్నాయి. వావివరసలు లేకుండా కొందరు క్రూర మృగాల్లాంటి మగాళ్లు ప్రవర్తిస్తోన్న తీరు మహిళలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో అమానుష ఘటనలు రోజురోజకూ పెరిగిపోతున్నాయి. వావివరసలు లేకుండా కొందరు క్రూర మృగాల్లాంటి మగాళ్లు ప్రవర్తిస్తోన్న తీరు మహిళలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బయటే కాకుండా ఇంట్లోనూ వేధింపులు తప్పడం లేదు. ఏకంగా కన్న తండ్రులే దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మానసిక వ్యాధితో బాధపడుతుందని ఆరోపిస్తూ కూతురిని 36 ఏళ్లుగా తండ్రి గొలుసులతో కట్టి ఆ తండ్రి గదిలో బంధించాడు. ఆమెకు ఇప్పుడు 53 సంవత్సరాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆమెను ఆరోగ్య కేంద్రానికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
యూపీలోని ఫిరోజాబాద్జిల్లా తుండ్లా ప్రాంతంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన గిరీష్ చంద్ అనే వ్యక్తికి సప్నా జైన్ అనే కూతురు ఉంది. అయితే సప్నాకు 17 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదంటూ ఆమెను గదిలోకి గొలుసుతో కట్టేసి బంధించాడు ఆమె తండ్రి. అప్పటి నుంచి గదిలో ఉన్న సప్నాకు ఆమె కుటుంబ సభ్యులు తలుపు కింద నుంచి భోజనం అందించేవారు. ఆ గదిలోనే సప్నా.. మల మూత్ర విసర్జన కూడా చేసేది. కిటికీలో నుంచి నీళ్లు పోస్తూ ఆమెకు స్నానం చేయించేవారు. ఇలా గత 36 ఏళ్లుగా గది దాటి బయటకు రాలేదు. అయితే ఇటీవల సప్నా తండ్రి గిరీష్ చంద్ కొద్ది నెలల క్రితం చనిపోయాడు. తాజాగా సప్నా గురించి తెలుసుకున్న స్థానిక స్వచ్ఛంద సేవా భారతి సభ్యులు ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెను గదిలో నుంచి బయటకు తీసుకొచ్చి స్నానం చేయించి కొత్త బట్టలు అందించారు. తర్వాత సప్నా గురించి స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలియజేశారు. వాళ్లు ఆమెను ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి : విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత నడిరోడ్డుపై దారుణంగా..!