ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పత్తికుంటపల్లి గ్రామానికి చెందిన బోడ రాజిరెడ్డి (40) అనే రైతు తన వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-11-11 15:20 GMT

దిశ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పత్తికుంటపల్లి గ్రామానికి చెందిన బోడ రాజిరెడ్డి (40) అనే రైతు తన వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మంజుల పోలీసులకు ఇచ్చిన వివరాల ప్రకారం మృతుడు రాజిరెడ్డి తనకున్న వ్యవసాయ భూమిలో పత్తి సాగు చేశాడని అన్నారు. దీంతో పాటు ఎలక్ట్రికల్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని అన్నారు. ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదని, ఉదయం సమీప రైతులు తన భర్త వ్యవసాయ భూమి వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపారు. మృతుడికి కూతురు, కుమారుడున్నారు. మృతుడికి కూతురు, కుమారుడున్నారు. ఈ సంఘటన స్థలాన్ని ఎస్సై శ్రీకాంత్ గౌడ్పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Tags:    

Similar News