యాక్సిడెంట్ కేసులో నకిలీ విలేఖరి హల్ చల్

ఓ యాక్సిడెంట్ కేసులో బాధితుడికి డబ్బులు ఇప్పిస్తానంటూ వచ్చిన నకిలీ విలేఖరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-10-17 14:25 GMT

దిశ, పేట్ బషీరాబాద్ : ఓ యాక్సిడెంట్ కేసులో బాధితుడికి డబ్బులు ఇప్పిస్తానంటూ వచ్చిన నకిలీ విలేఖరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుభాష్ నగర్ కు చెందిన సత్యనారాయణ (63) స్థానికంగా ఓ కంపెనీలో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. ఈనెల 9వ తేదీన పైప్లైన్ రోడ్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ సమీపంలో రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన సత్యనారాయణను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

     నడుము విరగడంతో పాటుగా తీవ్ర గాయాలు కావడంతో బాధితుడిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి కుటుంబానికి నకిలీ విలేఖరిగా చలామణి అవుతున్న ధర్మరాజు పరిచయం అయ్యాడు. ధర్మరాజు ప్రమాదానికి కారణమైన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవాల్సిందిగా కోరాడు. దాంతో గురువారం పోలీస్ స్టేషన్ సమీపంలోనే పంచాయితీకి వచ్చారు. ఈ క్రమంలో ధర్మరాజు నకిలీ విలేఖరి గా తెలియడంతో జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. 

Tags:    

Similar News