Extortion: గచ్చిబౌలిలో భారీ దోపిడీ.. బంగారం, డాలర్స్ ఎత్తుకెళ్లిన కేటుగాడు
నగరంలో భారీ దోపిడీ జరిగిన ఘటన గచ్చిబౌలి (Gachibowli)లో చోటుచేసుకుంది.

దిశ, శేరిలింగంపల్లి/వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ వ్యాపారస్తుల నుంచి బంగారాన్ని, యూఎస్ డాలర్లను ఓ కేటుగాడు కొట్టియగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అన్‌లైన్‌లో బంగారం వ్యాపారం చేస్తున్న నార్సింగికి చెందిన చంద్రశేఖర్, మనీ ఎక్స్‌చేంజ్ వ్యాపారం నిర్వహిస్తున్న నల్లగండ్ల ప్రాంతానికి చెందిన రఫీలకు శుక్రవారం సాయంత్రం స్టీఫెన్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తాను బంగారం, అమెరికన్ డాలర్లు కొంటానని చంద్రశేఖర్, రఫీలను గచ్చిబౌలి సెంట్రోమాల్ వద్దకు పిలిచాడు. వారిద్దరూ దుండగుడు చెప్పిన విధంగా అక్కడికి చంద్రశేఖర్, రఫీలు వచ్చారు. చంద్రశేఖర్ వద్ద 500 గ్రాముల గోల్డ్ బిస్కెట్లు, రఫీ వద్ద 18 వేల యూఎస్ డాలర్స్ తీసుకున్న దుండగుడు స్టీఫెన్ 5 నిమిషాల్లో డబ్బు ఇస్తానని వారిని ఒక రూంలో కూర్చోబెట్టి అక్కడి నుంచి దుండగుడు స్టీఫెన్ పరారయ్యాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. నార్సింగికి చెందిన చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.