వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేసేందుకు వెళ్లిన కూలీ వడదెబ్బతో మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.
దిశ, చేగుంట : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేసేందుకు వెళ్లిన కూలీ వడదెబ్బతో మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని షేర్ పల్లి గ్రామానికి చెందిన మేదరి బాలమణి (46) రోజు లాగే గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్లింది. మంగళవారం మధ్యాహ్నం పనులు చేస్తున్న సమయంలో అస్వస్థత గురికావడంతో ఇంటికి వెళ్లిపోయింది. సాయంత్రం నార్సింగ్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. చికిత్స పొందుతూ బాలమణి బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో బాలమణి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలంటూ గ్రామస్థులు కోరారు.