భార్యను రన్నింగ్ బస్ కిందికి తోసిన భర్త..
కట్టుకున్న భార్యను భర్త నడుస్తున్న బస్సు కిందికి తోసి వేయడంతో భార్యకు తీవ్రగాయాలైన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది.
దిశ, శంషాబాద్ : కట్టుకున్న భార్యను భర్త నడుస్తున్న బస్సు కిందికి తోసి వేయడంతో భార్యకు తీవ్రగాయాలైన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన బందన్న, పద్మ ఇద్దరు భార్యాభర్తలు బతుకుతెరువు కొరకు వచ్చి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రాల్లగూడలో నివసిస్తున్నారు. అయితే శనివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామానికి వెళ్లేందుకు శంషాబాద్ బస్టాండ్ వద్ద ఇద్దరు నిలబడి ఉన్నారు. అప్పటికే మద్యం సేవించిన భర్త బందన్న, భార్య పద్మలు పరస్పరం ఇద్దరు గొడవపడ్డారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న భర్త బంధన్న భార్యను నడుస్తున్న బస్సు కిందికి తోసి వేయడంతో భార్య పద్మకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి మద్యం మత్తులో ఉన్న భర్త బంధన్నను చితకబాది పోలీసులకు అప్పగించారు. 108 సహాయంతో తీవ్ర గాయాల పాలైన పద్మను ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.