Sabarimala News : శబరిమల కొండపై భక్తుడు ఆత్మహత్య
శబరిమల(Sabarimala) కొండపైగల అయ్యప్ప దేవస్థానం(Ayyappa Temple)లో అపశృతి చోటుచేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : శబరిమల(Sabarimala) కొండపైగల అయ్యప్ప దేవస్థానం(Ayyappa Temple)లో అపశృతి చోటుచేసుకుంది. ఓ 40 ఏళ్ల భక్తుడు ఉన్నట్టుండి ఫ్లైవోవర్ పైనుంచి కిందకు దూకాడు. ఈ ఘటనలో అతని కాలు, చెయ్యి విరిగింది. దాంతో అతడిని హుటాహుటిన దేవస్థానంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పంపా ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు మరిన్ని వైద్య పరీక్షలు చేయించేందుకు కొట్టాయంలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలిస్తుండగా గుండెపోటు వచ్చి అతడు మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడు కర్ణాటకలోని రామనగర జిల్లాకు చెందిన కుమార్‌గా గుర్తించారు. నిందితుడికి మానసిక వైకల్యం ఏమైనా ఉందా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు.