Crime: ప్రతీకారం తీర్చుకోవడానికి కోళ్లను చంపేశాడు .. చివరకు జైలుపాలయ్యాడు?

కోళ్లను చంపినందుకు చైనాలో ఓ వ్యక్తికి ఆరు నెలలు జైలు శిక్ష పడింది.

Update: 2023-04-10 03:13 GMT

దిశ, వెబ్ డెస్క్ : కోళ్లను చంపినందుకు చైనాలో ఓ వ్యక్తికి ఆరు నెలలు జైలు శిక్ష పడింది. కోళ్లు చంపితే జైలు శిక్ష పడుతుందా అని డౌట్ వస్తుందా? ఆ నిందితుడు చంపింది ఒకటో, రెండో కోళ్లు కావు. మొత్తం 1,100 కోళ్లు చంపాడు. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే చైనాలోని జాంగ్ అనే వ్యక్తికి , ఇంటి పక్కన వ్యక్తితో 2022 నుంచి వివాదం నడుస్తోంది. వారి అనుమతి లేకుండానే వారి ఇంటి దగ్గర ఉన్న చెట్లు నరికేసాడట. ఈ క్రమంలోనే జాంగ్ కోళ్ల ఫారమ్ లోకి వెళ్లి ఆ కోళ్ల ముఖాలపై ఫ్లాష్ లైట్ కొట్టడంతో..ఆ లైటును తట్టుకోలేక కోళ్లు చచ్చి పోయాయి. పోలీసు స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసాడు. పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుని.. పరిహారంగా జాంగ్ కు 3000 యువాన్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.35,700 చెల్లించాలని ఫైన్ వేసారట. దీంతో ఆ వ్యక్తి కోపం పెంచుకొని మళ్లీ కోళ్ల ఫారమ్ లోకి వెళ్లి రెండో సారి 640 కోళ్లను చంపాడు. దీంతో మళ్లీ జాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..వాళ్లు ఆ వ్యక్తిని అరెస్టు చేసి సెంట్రల్ చైనాలోని హునాన్ కోర్టులో ప్రవేశపెట్టారు. చివరికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

Tags:    

Similar News