అంత్యక్రియలకు వచ్చి వెళ్తూ అనంతలోకాలకు

హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలో అంత్యక్రియలకు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో వృద్ధురాలిని కారు ఢీకొట్టడంతో మృతి చెందింది.

Update: 2025-01-05 15:11 GMT

దిశ ,హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలో అంత్యక్రియలకు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో వృద్ధురాలిని కారు ఢీకొట్టడంతో మృతి చెందింది. సీఐ తిరుమల గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం శంకరపట్నం మండలం కల్వల గ్రామానికి చెందిన గాజుల ఓదెమ్మ శనివారం తన బంధువులు జూపాక గ్రామంలో మృతిచెందగా అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో హాజరైంది. తిరిగి వెళ్లేందుకు జమ్మికుంట- హుజురాబాద్ ప్రధాన రహదారిపై నిలబడి ఉంది.

     హుజురాబాద్ నుంచి జమ్మికుంటకు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వృద్ధురాలిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే బంధువులు హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలు కుమారుడు సర్వేశ్వర్ ఫిర్యాదు మేరకు వృద్ధురాలు మృతికి కారణమైన కారు డ్రైవర్ ఖాజా కలీమ్ ఉల్లా పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 


Similar News