ప్రముఖ వ్యాపారవేత్త హిందూజా గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత
ప్రముఖ వ్యాపారవేత్త హిందూజా గ్రూప్ ఛైర్మన్ శ్రీచంద్ పర్మానందన్ హిందూజ కన్నుమూశారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త హిందూజా గ్రూప్ ఛైర్మన్ శ్రీచంద్ పర్మానందన్ హిందూజ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంలో బాధపడుతున్న ఆయన లండన్‌లో ఓ ప్రవేటు హాస్పటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. 1935 నవంబర్ 28న బ్రిటిష్ ఇండియాలోని సింధ్ ప్రావిన్స్‌లోని కరాచిలో జన్మించారు. ఈయన దూరదృష్టి కలిగిన మార్గదర్శకుడు. ఆతిథ్య దేశం యూకే, స్వదేశమైన ఇండియా మధ్య బలమైన సంబంధాన్ని నిర్మించడంలో అన్నదమ్ములతో కలిసి ముఖ్య పాత్ర పోషించారని, ఫ్యామిలీ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది.