తాళం వేసిన ఇంట్లో చోరీ..
వనపర్తి జిల్లా కేంద్రంలోని తొమ్మిదో వార్డు భగీరథ కాలనీ టిప్పర్ యజమాని రాంబాబు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు.
దిశ,వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని తొమ్మిదో వార్డు భగీరథ కాలనీ టిప్పర్ యజమాని రాంబాబు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కాలనీవాసుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రూరల్ ఎస్సై చంద్రమోహన్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. భగీరథి కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న టిప్పర్ యజమాని రాంబాబు ఇంట్లో గురువారం రాత్రి సుమారు 12 గంటల నుండి నాలుగు గంటల సమయంలో చోరీ జరిగిందన్నారు. కాలనీలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రూ.2.50 లక్షల నగదు, 8 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. భాదితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.