NH -44 సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం..

అడ్డాకుల మండలం జాతీయ రహదారి NH -44 రోడ్డు పక్కన కాటవరం గ్రామ శివారు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Update: 2024-12-18 07:18 GMT

దిశ, అడ్డాకుల : అడ్డాకుల మండలం జాతీయ రహదారి NH -44 రోడ్డు పక్కన కాటవరం గ్రామ శివారు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యక్తి మృతి చెంది మూడు, నాలుగు రోజులు అయి ఉండవచ్చని  తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.


Similar News