చెరువులోకి దూసుకెళ్లిన బైక్.. ఇద్దరు మృతి

చెరువు కట్టపై మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుతూ చెరువులోకి

Update: 2025-03-24 11:59 GMT
చెరువులోకి దూసుకెళ్లిన బైక్.. ఇద్దరు మృతి
  • whatsapp icon

దిశ, పేట్ బషీరాబాద్: చెరువు కట్టపై మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుతూ చెరువులోకి తీసుకెళ్లిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.ఈ సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నాగుర్ కు చెందిన నామ్ దేవ్ కొంపల్లి ఉమామహేశ్వర కాలనీలో ఉంటున్న తన మేనల్లుడు అయినా బాలాజీని విడిచిపెట్టడానికి ఈనెల 22న నాగూర్ నుంచి బస్సులో వచ్చాడు. ఉమామహేశ్వర నగర్ కి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై దగ్గరలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ కి వెళ్లి మద్యం సేవించారు. తిరిగి వచ్చే క్రమంలో ఫోక్సాగర్ చెరువు కట్ట పైన వాహనంపై వస్తున్న క్రమంలో బైక్ అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు చెరువులో పడిపోయారు. కాగా సోమవారం స్థానికులు 100కు డయల్ చేసి ఫాక్స్ సాగర్ చెరువు లో రెండు శవలు తేలుతున్నాయని సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్థలం చేరుకొని మృతుల వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News